త‌ప్పు ఒప్పుకొన్న రాధార‌వి

  • IndiaGlitz, [Monday,March 25 2019]

ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార ప‌ట్ల రాధార‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఒక్క‌సారిగా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిప‌డింది. మ‌హిళ‌ల ప‌ట్ల వేదిక‌ల మీద అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టం త‌ప్పు అని ఖండించింది. దీంతో పాటు రాజ‌కీయ పార్టీలు కూడా రాధార‌వి మాట్లాడిన తీరును దుయ్య‌బ‌ట్టాయి.

న‌య‌న‌తార న‌టిస్తున్న 'ఐరా' సినిమాను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ ఏకంగా రాధార‌వి ని ఇక‌పై త‌మ సంస్థ‌లో నిర్మించే సినిమాల్లో న‌టుడిగా తీసుకోద‌ల‌చుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాయి. మిగిలిన నిర్మాణ సంస్థ‌లు కూడా అత‌న్ని ఎంక‌రేజ్ చేయ‌కూడ‌ద‌ని పిలుపునిచ్చారు. న‌డిగ‌ర్ సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ విశాల్ కూడా తీవ్రంగా స్పందించారు.

రాధారవి త‌న పేరులో ఉన్న తొలి రెండు అక్ష‌రాల‌ను తొల‌గించి ఇక‌పై ర‌వి అని పిలిపించుకోవాల‌ని సూచించారు. ఇప్పటికే ఈ విష‌యంపై రాధార‌వి సోద‌రి రాధిక‌, శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌ల‌క్ష్మి, సింగ‌ర్ చిన్మ‌యి, న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ స్పందించిన విష‌యం తెలిసిందే. దీని గురించి న‌య‌న‌తార మాత్రం ఎప్పుడూ నోరు తెర‌వ‌లేదు. అయినా రాధార‌వి ఈ విష‌యం మీద స్పందించారు. తాను ఒక అర్థంతో మాట్లాడితే, అంద‌రూ మ‌రో అర్థంతో దాన్ని తీసుకున్నార‌ని, వారంతా అనుకున్న‌ట్టు త‌ను త‌ప్పుగా మాట్లాడి ఉంటే క్ష‌మించ‌మ‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

More News

అ,ఆలు కూడా రాని లోకేశ్‌‌కు అగ్రతాంబూలమా!? 

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన షర్మిల లోకేశ్‌ గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌గా...

హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ను స్టార్ట్ చేశాడు.

ఐశ్వ‌ర్య గ‌ర్భ‌వ‌తి కాదు!

అందాల రాశి ఐశ్వ‌ర్య గ‌ర్భం దాల్చారా?  ఆమె మ‌రో సారి త‌ల్లి కాబోతున్నారా? అవున‌ని ఫొటోలు చెబుతుంటే, కాద‌ని ఆమె మీడియా టీమ్ చెబుతోంది.

వైసీపీ రూపంలో కేసీఆర్.. టీడీపీకి భయం

వైసీపీ రూపంలో కేసీఆర్ ఉన్నారని.. వైసీపీని చూస్తే టీడీపీకి భయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జ‌న‌సేన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. మూడు లోక్ స‌భ,