మే 6న శర్వానంద్ 'రాధ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • IndiaGlitz, [Friday,May 05 2017]

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'రాధ‌'.

అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న రాధ చిత్రంలో శ‌ర్వానంద్ న‌ట‌న‌, లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్‌, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ, చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం సినిమాకు మేజ‌ర్ హైలైట్స్‌. సినిమా ప్రారంభం నుండి శ‌ర్వానంద్ వ‌రుస స‌క్సెస్‌లు సాధించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాధ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన పాట‌లు కూడా హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలన్నీ పూర్తయ్యాయి. సినిమా సెన్సార్‌కు సిద్ధ‌మైంది.

మే 12న సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. అంత కంటే ముందుగా మే 6న విజ‌య‌వాడ‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మక్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తాం. అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే చిత్రం రూపొందిన రాధ శ‌ర్వానంద్ కెరీర్‌లో మ‌రో హిట్ మూవీ అవుతుందని చిత్ర స‌మ‌ర్ప‌కులు బివిఎస్ఎన్ ప్ర‌సాద్ తెలియ‌జేశారు.

శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు, ద‌ర్శ‌క‌త్వంః చంద్ర‌మోహ‌న్‌.