పాట పుట్టిన చోటే 'రచయిత' గీతావిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
దుహర మూవీస్ సమర్పించు చిత్రం "రచయిత". ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం హైదరాబాద్ మణికొండ లోని పాటల రచయిత చంద్రబోస్ నివాసం లో నటుడు జగపతిబాబు సమక్షంలో చంద్ర బోస్ పాడి వినిపించడం తో ఈ ఆడియా విడుదల జరిగింది.
అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ.. "నాకు రచయితలంటే చాలా గౌరవం. "రచయిత" అనే సినిమా సస్పెన్సు థ్రిల్లర్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చడం తో మొదట నేనే నటించాలనుకున్నా కానీ నా డేట్స్ కుదరకపోవడం చేత చేయలేకపోయాను. ఈ చిత్ర దర్శకుడు నా మిత్రుడు తను మంచి సినిమా తీసాడనే ఉద్దేశ్యం తోనే చిన్న సినిమా బ్రతకాలనే తపనతోనే నా ఫేస్ బుక్ ద్వారా ఈ పాటలను విడుదల చేయడం జరుగుతోంది.
అంతేకాదు ఈ సినిమా కోసం నేను వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.. పెద్ద వారు పెద్దగా ఎదుగుతున్నారు, కానీ చిన్నవారు ఎప్పటికీ చిన్నవారిలానే ఉండిపోతున్నారు అనే ఆవేదన తోనే నేనే సపోర్ట్ చేయడం జరుగుతోంది. అన్నీ సినిమాలకు ఆడియో వేడుక సాధారణంగా జరుగుతుంది కానీ ఈ చిత్ర టైటిలే "రచయిత" కనుక ఈ చిత్రానికి పాటలు రచించిన చంద్రబోస్ ఏ సీట్ లో అయితే ఈ సినిమా పాటలు పుట్టించాడో ఆదే సీట్ లో విడుదల చేయాలని నిర్ణయించుకొని చంద్ర బోస్ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రచయిత సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా డైరెక్ట్గా పబ్లిక్ కు చేరేలా డిసెంబర్ 8న ఒక థియేటర్లో సినిమాను ప్రదర్శింప చేసి నేనే స్వయంగా థియేటర్ బయట మైక్ పట్టుకు నిల్చొని ప్రేక్షకుల రివ్యూ తెలుకోబోతున్నా, ఇదంతా నా మిత్రుడు సాగర్ చేసిన మంచి ప్రయత్నం కోసమే, ఇప్పుడు విడుదలైన మూడు పాటలలో నాకు "ఏ ఎదలో ఏముంటుందో" అనే పాట నాకు బాగా నచ్చింది" అన్నారు.
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాను బ్రతికించాలనే తపనతోనే హీరో, నటుడు జగపతిబాబు గారు తన సహాయసహకారాలు అందచేస్తున్నారు.. పాటలు రచించడానికి నేను ఎక్కడికీ వెళ్ళను నా ఇంట్లోనే ఈ సీట్ లొనే రాస్తాను.
అందుకే ఈ సినిమా పాటలు ఇక్కడ జగపతిబాబు గారి సమక్షంలో నిర్వహిస్తున్నాం, 22 ఏళ్ల నా కెరీర్లో 800 పాటలు రాసాను, కానీ చాలా నచ్చిన పాటలు మాత్రం ఈ రచయిత సినిమా పాటలే. ఈ చిత్రంలో 3 పాటలున్నాయి.
మూడు కూడా సందర్భానుచితంగా ఉంటాయి. ఆ పాటలు నేను ఇప్పుడు పాడి విడుదల చేస్తాను. మొదటి పాట ఏ ఎదలో ఏముందో రెండో పాట నల్ల రంగు మబ్బులో, మూడవ పాట రానా ప్రియా చిరునవ్వులో ఈ గీతాలకు సంగీతం అందించింది శ్యామ్ మలయాళ సంగీత దర్శకుడు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments