రెండో రేసు గుర్రం వస్తోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
రేసు గుర్రం.. 2014 వేసవికి విడుదలై ఆ ఏడాదిలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సలోని, బ్రహ్మానందం, రవి కిషన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలు వినిపించింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రెడీ అవుతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలోనూ బన్నీనే కథానాయకుడిగా నటించనున్నారు. అయితే దర్శకుడు, నిర్మాణ సంస్థకి సంబంధించిన పూర్తివివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి.
కాగా.. అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రేసు గుర్రం రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. బన్నీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఒకటిగా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com