'రావాలి జగన్.. కావాలి జగన్' రికార్డ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాటను పార్టీ శ్రేణులు పాడించిన విషయం విధితమే. ఈ పాట ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సోషల్ మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటను ఇప్పటి వరకూ వీక్షించిన వారి సంఖ్య 70లక్షలు దాటడం విశేషమని చెప్పుకోవచ్చు. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ రేంజ్లో జనాలను ఆకర్షించడం.. జనాలను తమవైపు తిప్పుకునేలా చేయడం బహుశా ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. నెట్టింట సంచలనం సృష్టించిన వైసీపీ పాట ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ పాట జగన్ పాదయాత్ర ముగింపు అనంతరం రిలీజైంది. ఇంత తక్కువ కాలంలోనే రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. కాగా.. ఈ గీతాన్ని ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. గాయకుడు మనో ఆలపించారు. కాగా ఈ పాటను వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దగ్గరుండి ట్యూన్ చేయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వైసీపీ తర్వాతే..
ఇదిలా ఉంటే.. వరుసగా చూస్తే మొదటి స్థానంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట ఉండగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల గీతాలు ఉన్నాయి. కాగా.. ఈ రేంజ్లో సంచలనం సృష్టించిన పాట గురించి తెలుగు మీడియానే కాదు.. జాతీయ మీడియా ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేయడం విశేషం. ఇలా ఈ పాట మార్మోగుతుండటంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా.. జనాల్లోకి దూసుకెళ్తున్నారని పార్టీ పెద్దలు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments