రాశి ఈజ్ బ్యాక్

  • IndiaGlitz, [Friday,December 11 2015]

సీనియ‌ర్ హీరోయిన్ రాశి ఇప్పుడు మ‌ళ్ళీ తెర‌పై క‌నిపించ‌బోతుంది. దాదాపు 12 ఏళ్ళ త‌ర్వాత రాశి సినిమాలో క‌నిపించ‌నుండ‌టం విశేషం. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా రూపొందుతోన్న క‌ళ్యాణ వైభోగ‌మే' చిత్రంలో హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ పాత్ర కోసం నందిని రెడ్డి ముందు క‌లిసిన‌ప్పుడు నా పాప‌కు మూడు నెల‌లు కాబ‌ట్టి ముందు ఒప్పుకోలేదు. మ‌ళ్ళీ ఐదు నెల‌లు త‌ర్వాత వ‌చ్చి నా క్యారెక్ట‌ర్‌ను నేరేట్ చేసింది, స‌రేన‌ని ఒప్పుకున్నాను. త‌మిళంలో కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ, అన్నీ పాత్ర‌ల‌ను చేయ‌డం లేదు. ఒక‌ప్ప‌టితో పోల్చితే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు త‌గ్గిపోయాయని కూడా రాశి చెప్పుకొచ్చింది.