రాశికి ఆ పాట నచ్చిందట
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది రాశీ ఖన్నా. అనతి కాలంలో ఇక్కడివారికి చేరువైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికే రవితేజ లాంటి స్టార్ హీరోతో జోడీ కట్టింది. ప్రస్తుతం మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌కి జోడీగా జైలవకుశలో నటిస్తోంది. ఈ చిత్రంలో లవ పాత్రతో రాశి రొమాన్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే..
ఈ సినిమాలో రాశికి ఒకే ఒక పాట ఉంది. అదే ట్రింగ్ ట్రింగ్. అయితే రాశికి మాత్రం సినిమాలో నచ్చిన పాట ఏమిటంటే.. రావణ అట. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంది ఈ బ్యూటీ. రావణ సాంగ్ ఈజ్ ఎన్ ఎడిక్షన్ అంటూ.. నిన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిందీ సుందరి. రాశీకే కాదు.. జైలవకుశ పాటలు విన్న ఎవరికైనా ఈ పాటే నచ్చుతుంది. జైలవకుశ ఈ నెల 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com