పొలిటిక్స్‌లోకి వస్తానంటున్న రాశీఖన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
ఉ్తతరాది ముద్దుగుమ్మ రాశీఖన్నా.. వరుస తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైంది. హీరోయిన్గా రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు కంటే తమిళంలో ఈ చబ్బీ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. సినిమాల తర్వాత ఏం చేయాలనుకుంటున్నావని రీసెంట్గా కోలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు చెప్పిన సమాధానం వింటే అబ్బో అనుకోవాల్సిందే.
"చిన్నప్ప్పుడు ఐఏయస్ ఆఫీసర్ కావాలని అనుకునేదాన్ని అయితే అనుకోకుండా నటన రంగంలోకి అడుగుపెట్టాను. అయితే నేను తప్పకుండా ప్రజలకు సేవ చేస్తాను. అందు కోసం ముందుగా ఓ ఎన్టీఓ పెడతాను. వీలైతే రాజకీయాల్లోకి కూడా వస్తాను. నాకు రాజకీయాలు తెలియవు కానీ.. ప్రజలకు సేవ చేయడం తెలుసు" అని రాశీఖన్నా చెప్పింది. రాశీఖన్నా ఇలా చెప్పడం చూస్తుంటే మీ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందనిపిస్తుంది. మరి ఆ తరుణమెప్పుడో తెలియాలంటే ఆగక తప్పేలా లేదు.
ఈ ఏడాది రాశీఖన్నా మెయిన్ హీరోయిన్గా చేసిన వరల్డ ఫేమస్ లవర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు సైతాన్ కా బచ్చా, తుగ్లక్ దర్బార్, అరణ్మణి చిత్రాలతో నటిస్తున్న రాశీఖన్నాను హీరోయిన్గా నటింప చేయడానికి మరికొంత మంది తమిళ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout