సూర్యకు జోడీగా రాశీఖన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్య తన 38వ చిత్రం శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)ని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుజరుగుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోపు సూర్య తన 39వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ హరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అరువా’ అంటే కత్తి అనే అర్థం వస్తుంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆరో సినిమా ఇది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటించనుంది. ఈ విషయాన్ని రాశినే సోషల్ మీడియా చాట్‌లో అభిమానులకు తెలియజేసింది. రాశీఖన్నా ఇప్పటికే తమిళంలో ఇమైకా నోడిగల్(అంజలి సీబీఐ ఆఫసర్) సినిమాతో పాటు కొన్ని చిత్రాల్లోనటించింది. సుందర్.సి దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటించింది. ఇప్పటి వరకు తమిళంలో మంచి బ్రేక్ లేని రాశీఖన్నాకు హరి సినిమా ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments