మూడు సినిమాలతో రాశి
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా విడుదలైన ఎన్టీఆర్ జైలవకుశలో ప్రియ పాత్రలో సందడి చేసింది రాశి ఖన్నా. అందులో ట్రింగ్ ట్రింగ్ అంటూ సాగే పాటలో తన అందాలతో కుర్రకారుని కవ్వించింది. ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్‌లే. వీటిలో ముందుగా రానున్నది మాత్రం అతిథి పాత్రలో మెరిసిన రాజా ది గ్రేట్. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది.
ఆ తరువాత అదే నెల 19న రాశి తొలి మలయాళ చిత్రం విలన్ విడుదల కానుంది. ఇందులో మోహన్‌లాల్, విశాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. మరో వారం తరువాత అంటే.. అక్టోబర్ 27న గోపీచంద్‌తో జోడీకట్టిన ఆక్సిజన్ రిలీజ్ కాబోతోంది. మరి, ఈ మూడు చిత్రాల్లో రాశికి ఏ సినిమా మంచి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments