అందుకనే...అనిల్ నెక్ట్స్ మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను - రాశీ ఖన్నా
- IndiaGlitz, [Monday,May 02 2016]
ఊహలు గుసగుసలాడే..చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆతర్వాత జిల్, జోరు, బెంగాల్ టైగర్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన సుప్రీమ్ సినిమాలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇంటర్ వ్యూ మీకోసం...
పోలీస్ పాత్రలో కామెడీ చేసారట కదా...?
అవును...నా క్యారెక్టర్ పేరు బెల్లం శ్రీదేవి. ఫస్ట్ టైమ్ పోలీస్ క్యారెక్టర్ చేసాను. అలాగే నేను కామెడీ చేయడం కూడా ఫస్ట్ టైమే. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా ఎక్కువు ఉంటుంది. ఆడియోన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఫస్ట్ టైమ్ పోలీస్ క్యారెక్టర్ చేసారు కదా...ఈ క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ ఏమైనా చేసారా..?
లేడీ పోలీస్ అనగానే విజయశాంతి గుర్తుకువస్తుంది కదా...అందుకని యుట్యూబ్ లో విజయశాంతి చేసిన పోలీస్ క్యారెక్టర్స్ చూసాను. ఎలా నడవాలి..ఎలా మాట్లాడాలి..అనేది చూసి నేర్చుకున్నాను. కామెడీ చేయడం..పోలీస్ క్యారెక్టర్ చేయడం...ఈ రెండూ ఒకే సినిమాలో చేయవలసి రావడంతో ఛాలెంజింగ్ గా తీసుకుని చేసాను. బాగానే చేసాను అనుకుంటున్నాను. ఎలా చేసాను అనేది సినిమా చూసాకా ఆడియోన్స్ చెప్పాలి.
ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేసారనుకుంటా..?
అవును...ఫైట్స్ చేసాను. ఇంట్రడక్షన్ సీన్ లో ఓ యాక్షన్ సీన్ ఉంటుంది. నేను ఫైట్ చేస్తుంటే హీరో సాయిధరమ్ తేజ్ వెనక నుంచి అలా చూస్తుంటాడు. ఫైట్స్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది.
మళ్లీ పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం వస్తే..చేస్తారా..?
ఎందుకు చేయను...ఖచ్చితంగా చేస్తాను. పోలీస్ క్యారెక్టర్ అనే కాదు...నటనకు అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తాను.
ఇంతకీ...సుప్రీమ్ కాన్సెప్ట్ ఏమిటి..?
హీరో సాయిధరమ్ తేజ్ టాక్సీ డ్రైవర్, హీరోయిన్ రాశీ ఖన్నా పోలీస్..వీరిద్దరి మధ్య లవ్...(నవ్వుతూ..) దీంతో పాటు చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అవి ఏమిటి అని చెప్పేస్తే కథ తెలిసిపోతుంది. అందుచేత చెప్పను మీరు తెర పై చూడాల్సిందే. కానీ...ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సుప్రీమ్ అందరి మనసులను టచ్ చేస్తుంది.
అందం హిందోళం పాట రీమిక్స్ చేసారు కదా...తేజు తో డాన్స్ చేయడం ఎలా అనిపించింది..?
చిరంజీవి గారు చేసిన అందం హిందోళం సాంగ్ చూసినప్పుడు ఈ పాటకు తగ్గట్టు డాన్స్ చేయడం కష్టం అనిపించింది. తేజు చాలా మంచి డాన్సర్. అలాగే హార్డ్ వర్కర్. తేజు స్టెప్స్ కు తగ్గట్టు బాగానే డాన్స్ చేసాను అనుకుంటున్నాను.
పటాస్ తో సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడికి సుప్రీమ్ రెండో సినిమా...ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
అనిల్ మంచి రైటర్, ఏక్టర్, డాన్సర్, డైరెక్టర్...ఇలా ఆయన గురించి చాలా చెప్పచ్చు. ఫ్యూచర్ లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అందుకనే అనిల్ తో నెక్ట్స్ మూవీలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అని చెప్పాను.
కవిత్వం రాస్తున్నారు కదా..? ఎక్కువుగా ఏ విషయాల పై కవిత్వం రాస్తుంటారు..?
ఎప్పుడైనా టైమ్ దొరికినప్పుడు కవిత్వం రాస్తుంటాను. ప్రకృతి పై రాస్తుంటాను, ప్రేమ పై రాస్తుంటాను...ఒకటని లేదు. ఆ టైమ్ లో నన్ను ఏది ఇన్ స్పైయిర్ చేస్తే దాని పై రాస్తుంటాను. భవిష్యత్ లో నేను రాసిన కవితలు అన్ని కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది.
హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నారు కదా..ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు...నేను తెలుగు సినిమాల్లో నటిస్తుండడం వలన ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నాను. అందుచేత పేరెంట్స్ ను వదిలి ఉండాల్సి వస్తుంది. అది ఇష్టం లేకే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నాను.
బాలీవుడ్ మూవీస్ చేయాలనుకుంటున్నారా..?
తెలుగు సినిమాలు చేస్తున్నాను. ఫ్యూచర్ లో తమిళ్ మూవీస్ కూడా చేస్తాను. అయితే బాలీవుడ్ గురించి ప్రస్తుతానికి ఏమీ ఆలోచించ లేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
గోపీచంద్ తో సినిమా చేస్తున్నాను. అలాగే రవితేజ తో కూడా ఓ మూవీ చేస్తున్నాను.