'జ‌వాన్' కోసం రాశి పాట‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత జిల్‌, బెంగాల్ టైగ‌ర్‌, జై ల‌వ కుశ త‌దిత‌ర చిత్రాల్లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు సినిమా చేస్తోంది.

ఇదిలా ఉంటే.. యాక్టింగ్‌కే ప‌రిమితం కాకుండా అప్పుడ‌ప్పుడు త‌న సింగింగ్ టాలెంట్‌ని కూడా ప్ర‌ద‌ర్శించే రాశి.. జోరు చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి మెప్పించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అలాగే మ‌ల‌యాళ చిత్రం విల‌న్ కోసం కూడా ఓ పాట పాడింది.

అదే విధంగా నారా రోహిత్ బాల‌కృష్ణుడు కోసం కూడా రాశి గొంతు స‌వ‌రించుకుంది. అంతేకాకుండా.. తాజాగా జ‌వాన్ కోసం థ‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో బంగారు అనే పాట‌ని కూడా పాడింది రాశి. త్వ‌ర‌లోనే ఈ పాట‌ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ పాట పాడించిన థ‌మ‌న్‌తో పాటు పాట‌ను విన్న చిత్ర ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపీచంద్.. రాశి గానానికి ట్విట్ట‌ర్‌లో పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. జ‌వాన్‌ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా విడుద‌ల కానుంది.