నన్నడగనేలేదు అంటున్న అందాల రాశీ!
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని మాటలు వినడానికి బావుంటాయి. మనకే బావుంటే వాటి సంబంధీకులకు ఇంకా బావుంటాయి. అలాంటి విషయమే ఈ మధ్య రాశీఖన్నా జీవితంలో చోటుచేసుకుంది. రాశీఖన్నా స్కిన్ టోన్ చాలా బావుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పాతతరం నటి జయప్రదను గుర్తు చేస్తుంది. ఈ మధ్య రాశీఖన్న మరింత సన్నగా మారి చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది.
సో ఈ బ్యూటీని నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న యన్.టి.ఆర్. బయోపిక్ కోసం అడిగారని.. అందులో జయప్రద రోల్‌ని ఆఫర్ చేశారని వదంతులు వ్యాపించాయి. ఆ మాట వినగానే అటు రాశీఖన్నా, రాశీ అభిమానులు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ మధ్య రాశీ ఓ సందర్భంలో ``ఈ విషయం నా వరకూ వచ్చింది.
కానీ ఇంకా యన్.టి.ఆర్ బయోపిక్‌కి సంబంధించి నన్నెవరూ సంప్రదించనేలేదు అని గుట్టు విప్పేసింది. ఆల్రెడీ రాశీని ఆ పాత్ర కోసం అనుకున్న మాట నిజమేఅయితే, రాశీ ఖన్నా స్టేట్మెంట్ చూసిన తర్వాతైనా చిత్ర యూనిట్ వెంటనే ఆమె ముందు వాలిపోతుందన్నది వాస్తవం. ఆమె ఇటీవల నయనతార మరదలి పాత్రలో నటించిన `ఇమైక్కానొడిగల్` తమిళంలో మంచి టాక్‌తో నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments