న‌న్న‌డ‌గ‌నేలేదు అంటున్న అందాల రాశీ!

  • IndiaGlitz, [Monday,September 03 2018]

కొన్ని మాట‌లు విన‌డానికి బావుంటాయి. మ‌న‌కే బావుంటే వాటి సంబంధీకుల‌కు ఇంకా బావుంటాయి. అలాంటి విష‌య‌మే ఈ మ‌ధ్య రాశీఖ‌న్నా జీవితంలో చోటుచేసుకుంది. రాశీఖ‌న్నా స్కిన్ టోన్ చాలా బావుంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే పాత‌త‌రం న‌టి జ‌య‌ప్ర‌ద‌ను గుర్తు చేస్తుంది. ఈ మ‌ధ్య రాశీఖ‌న్న మ‌రింత స‌న్న‌గా మారి చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తోంది.

సో ఈ బ్యూటీని నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న య‌న్‌.టి.ఆర్‌. బ‌యోపిక్ కోసం అడిగార‌ని.. అందులో జ‌య‌ప్ర‌ద రోల్‌ని ఆఫ‌ర్ చేశార‌ని వ‌దంతులు వ్యాపించాయి. ఆ మాట విన‌గానే అటు రాశీఖ‌న్నా, రాశీ అభిమానులు కూడా హ‌ర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ మ‌ధ్య రాశీ ఓ సంద‌ర్భంలో ''ఈ విష‌యం నా వ‌ర‌కూ వ‌చ్చింది.

కానీ ఇంకా య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌కి సంబంధించి న‌న్నెవ‌రూ సంప్ర‌దించ‌నేలేదు అని గుట్టు విప్పేసింది. ఆల్రెడీ రాశీని ఆ పాత్ర కోసం అనుకున్న మాట నిజ‌మేఅయితే, రాశీ ఖ‌న్నా స్టేట్‌మెంట్ చూసిన త‌ర్వాతైనా చిత్ర యూనిట్ వెంట‌నే ఆమె ముందు వాలిపోతుంద‌న్న‌ది వాస్త‌వం. ఆమె ఇటీవ‌ల న‌య‌న‌తార మ‌ర‌ద‌లి పాత్ర‌లో న‌టించిన 'ఇమైక్కానొడిగ‌ల్‌' త‌మిళంలో మంచి టాక్‌తో న‌డుస్తోంది.

More News

ప్ర‌భాస్‌.. ఇప్పుడు స్పీడున్నోడు!

ఒక సినిమా విడుద‌ల కావ‌డం.. మ‌రో సినిమా సెట్స్ మీద ఉండ‌టం, ఇంకో సినిమా ప్రారంభం కావ‌డం.. మ‌ధ్య‌లో క‌థ‌లు విన‌డం.. ఇవ‌న్నీ స్పీడున్న హీరో ల‌క్ష‌ణాలు. తాజాగా ప్ర‌భాస్ ని చూసిన వారంద‌రూ స్పీడున్నోడు

ఘనంగా మను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక..

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్ – చాందిని చౌదరి ప్రధాన పాత్రలో  వస్తున్న  సినిమా 'మను'..

'హ‌లో..' రీ షూట్ చేస్తున్నారా?

రామ్ హీరోగా రూపొందుతోన్న హ‌లో గురూ ప్రేమ కోస‌మే సినిమా రీ షూట్స్ జ‌రుగుతున్నాయా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు.

హీరోయిన్‌కి రెయిన్‌చెక్ ఇవ్వ‌డ‌మే క‌థ - అభిలాష్‌

స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యాన‌ర్‌లో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స‌మ‌ర్పించు చిత్రం ప్రేమ‌కు రెయిన్ చెక్‌.

షూటింగ్ ద‌శ‌లో అడివి సాయికిర‌ణ్ 'ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌'

ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) , నిత్యా న‌రేశ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'ఆప‌రేషన్ గోల్డ్ ఫిష్‌'.