కొత్త కళ నేర్చుకుంటోన్న రాశీఖన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ రాశీఖన్నాముందు ఇక ఎవరైనా పోకిరి వేషాలేస్తే అంతేనండోయ్! ఎందుకంటే.. ఈ అమ్మడు ఇప్పుడు కొత్త విద్యను నేర్చుకుంటోంది. ఇంతకీ రాశీఖన్నా నేర్చుకుంటోంది ఏంటో తెలుసా? కిక్ బాక్సింగ్. ఇప్పటికే లుక్‌పై ఫోకస్ పెట్టి బరువు తగ్గిన రాశి..ఇప్పుడు షాహిద్ కపూర్‌తో కలిసి చేయబోతున్న సన్నీ అనే సినిమా కోసం రాశీఖన్నా కిక్ బాక్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ‘‘కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరక శక్తే కాదు.. మానసిక శక్తి కూడా పెరుగుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే బలం వస్తుంది. అది కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. దీని కోసం ప్రత్యేకమైన డైట్‌ను పాటిస్తున్నాను. ప్రతిరోజూ గంటసేపే శిక్షణ తీసుకుంటున్నాను. మనందరికీ మానసిక బలం ఎంతో అవసరం’’ అని అంటోంది రాశీఖన్నా.
గత ఏడాది మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమాలో నటించిన రాశీఖన్నా.. ఇప్పుడు మరోసారి మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ఇది కాకుండా తమిళ, హిందీ చిత్రాలతోనూ బిజి బిజీగా ఉంది రాశీఖన్నా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com