రాశీ ఖ‌న్నా అదుర్స్‌

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

2014లో విడుద‌లైన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశి ఖ‌న్నా. జోరు నుంచి జైల‌వ‌కుశ వ‌ర‌కు కంటిన్యూగా తెలుగు సినిమాలు చేస్తున్న ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్‌తో తొలి ప్రేమ‌, ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు సినిమాలు చేస్తోంది. అలాగే జిల్ త‌రువాత గోపీచంద్‌తో జోడీక‌ట్టిన ఆక్సిజ‌న్ న‌వంబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది. మోహ‌న్‌లాల్ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ సినిమాలో విశాల్‌, హ‌న్సిక‌, శ్రీ‌కాంత్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల‌యాళ చిత్రాల ప‌రంగా.. తొలి రోజున‌ రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్లను రాబ‌ట్టిన ఈ సినిమా.. రాశికి అక్క‌డా మంచి గుర్తింపునే తీసుకువ‌చ్చింది.

ఎక్స్‌ప్రెసివ్ క‌ళ్లు, ఇంప్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో రాశి మ‌ల‌యాళంలో అదుర్స్ అనిపించేలా డెబ్యూ ఇచ్చింద‌ని అక్క‌డి విమ‌ర్శ‌కులు ఆమెని ప్ర‌శంసిస్తున్నారు. మొత్తానికి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ మొద‌టి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింద‌న్న‌మాట రాశి.