ఐటమ్ సాంగ్ లో రాశి
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహలు గుసగుసలాడే చిత్రంలో హోమ్లీగా కనిపించి మెప్పించింది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆ సినిమా తరువాత స్కిన్ షోకి సైతం సై చెప్పిన రాశీ.. బెంగాల్ టైగర్ తదితర చిత్రాల్లో గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆమె తాజా చిత్రం జైలవకుశలోనూ ట్రింగ్ ట్రింగ్ పాటలో గ్లామర్ డోస్‌తో కనువిందు చేయనుందీ సుందరి.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు హీరోయిన్ పాత్రల్లో సందడి చేసిన ఈ చిన్నది ఐటమ్ గర్ల్‌గానూ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాశి హీరోయిన్‌గా సుప్రీమ్ చిత్రాన్ని చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి .. తన తాజా చిత్రం రాజా ది గ్రేట్ (రవితేజ హీరో)లో ఒక ప్రత్యేక గీతం కోసం రాశిని సంప్రదించాడని.. పారితోషికం కూడా భారీగానే ఉండడంతో ఆమె ఈ పాటకి ఒప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజతో ఇప్పటికే బెంగాల్ టైగర్ చేసిన రాశి.. ప్రస్తుతం రవితేజ మరో కొత్త చిత్రం టచ్ చేసి చూడులోనూ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజా ది గ్రేట్ లో రాశి చేసే ఐటమ్ సాంగ్‌కి సంబంధించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com