ఆ హీరో తో టెన్షన్ అంటున్న రాశి ఖన్నా
- IndiaGlitz, [Wednesday,September 30 2015]
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై..అనతి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. రామ్ తో కలసి రాశి ఖన్నా శివమ్ చిత్రంలో నటించింది. శివమ్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే...రామ్ తో వర్క్ చేయడం ఎలా ఉందని..రాశి ఖన్నాను అడిగితే...రామ్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఆయన ఎనర్జి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే..రామ్ చాలా ఈజీగా వేసేస్తాడు. అందుచేత రామ్ తో డాన్స్ చేయడమంటే నాకు టెన్షన్ అంటోంది రాశి ఖన్నా. మరి..టెన్షన్ తో డాన్స్ ఎలా చేసిందో చూడాలంటే శివమ్ చూడాల్సిందే.