హైతమ్ కాలేజ్ లో సందడి చేసిన రాశీ ఖన్నా

  • IndiaGlitz, [Saturday,August 19 2017]

హైదార‌బాద్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్ మెంట్ లో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సంద‌డి చేశారు. కాలేజ్ కి సంబంధించిన కాన్వకేష‌న్, క‌మ్ ఫ్రెష‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు రాశీఖ‌న్నా. హైత‌మ్ కాలేజ్ లో నాలుగేళ్లు ఇంజ‌నీరింగ్ పూర్తి చేసుకొన్న ప‌ట్ట‌బ‌ద్రుల్ని రాశీ ఖ‌న్నా అభినందించారు. ఈ సంద‌ర్భంగా వారితో రాశీ ఖ‌న్నా స్వ‌యంగా సెల్ఫీలు దిగ‌డం ప‌లువురుని ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత పాత్రికేయుల‌తో ముచ్చ‌టించిన రాశీ, హీత‌మ్ కాలేజ్ విజిట్ త‌న కాలేజ్ డేస్ ని గుర్తి చేసింద‌ని, కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన ప్రెజంటేష‌న్ త‌న‌ని ఆక‌ట్టుకుంద‌ని, ఫ్యూచ‌ర్ ఇంజ‌నీర్స్ ను క‌ల‌వ‌డం త‌న‌కు ఆనాందాన్ని ఇచ్చింద‌ని రాశీ తెలిపారు.

ఆనంతరం కాలేజ్ ఛైర్మెన్ ప్రసాద్ ఆరుట్ల మాట్టాడుతూ 17 ఏళ్లుగా ఎంద‌రో భావి ఇంజ‌నీర్ల‌ని హైత‌మ్ అందించింద‌ని, త‌మ కాలేజ్ లో చ‌దువుకున్న విధ్యార్ధులు ఇప్పుడు చ‌క్క‌టి హోదాల్లో ఉన్నార‌ని, కొంద‌రు టాప్ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ఆ త‌రువాత జ‌రిగిన ఫ్రెష‌ర్స్ డే పార్టీలో విద్యార్ధుల‌తో క‌లిసి రాశీ చిందేశారు. అలానే తొలి సంవ‌త్స‌రం విద్యార్ధులు ప్ర‌ద‌ర్శించిన ప‌లు సాంస్రృతిక కార్య‌క్ర‌మాలు అతిధుల్ని ఆక‌ట్టుకున్నాయి. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాశీ ఖ‌న్నాతో పాటు కాలేజ్ ఛైర్మెన్ : ప్ర‌శాంత్ ఆరుట్ల‌, ప్రిన్సిప‌ల్ : రామకృష్ణ రాజు, డీన్ : ప్ర‌భాక‌ర్, డైరెక్ట‌ర్ : ర‌వీంద్ర‌ర్ పాల్గొన్నారు.