రాశీఖన్నాకు ఇదే తొలిసారి... ఎగ్జయిట్ అవుతుందట
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖన్నా అందచందాలతో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. మంచి గాత్రంతోనూ పాటలు పాడి అందరినీ అలరిస్తుంటుంది. సింగర్‌గానూ కొన్ని సినిమాల్లోనూ రాశీ పాడిన సంగతి తెలిసిందే. తాజాగా రాశీ మరో డేర్ స్టెప్ తీసుకుంది. అదేంటంటే డబ్బింగ్ చెప్పడం తొలిసారిగా రాశీఖన్నా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ విషయాన్ని రాశీఖన్నానే తెలియజేసింది. తొలిసారి తాను డబ్బింగ్ చెప్పుకున్నానని, ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని రాశీ తెలియజేసింది. ఈమె హీరోయిన్గా నటిస్తున్న చిత్రాల్లో `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ త్రెసా, ఇజాబెల్లె హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత విజయ్ దేవరకొండ `హీరో` సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు సెన్సిబుల్ సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ తొలిసారి రొమాంటిక్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com