సీరత్ తో సంబంధం లేదంటున్న రాశి ఖన్నా

  • IndiaGlitz, [Monday,January 29 2018]

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం టచ్ చేసి చూడు'. ఈ చిత్రంతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం కానున్నారు. రాశిఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా న‌టించిన ఈ చిత్రంలో ఫ్రెడ్డి దారువాలా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మురళీ శర్మ, సత్యం రాజేష్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్ర‌మోషన్‌లో భాగంగా కథానాయిక రాశిఖన్నా మాట్లాడుతూ, “ఈ సినిమాలో నాది హ్యూమరస్‌గా ఉండే గ్లామర్ పాత్ర. ర‌వితేజ‌తో మ‌రోసారి న‌టించ‌డం మంచి అనుభూతి.

రెండోసారి కూడా మా కాంబినేష‌న్ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇందులో మ‌రో క‌థానాయిక‌గా సీరత్ ఉన్న‌ప్ప‌టికీ.. ఆమెకు, నాకు ఎటువంటి కాంబినేషన్ సీన్స్ లేవు. మా ఇద్దరి పాత్రలు వేరు వేరు సంద‌ర్భాల‌లో వస్తూ వుంటాయి” అని తెలిపింది. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

More News

'కృష్ణార్జున యుద్ధం'లో నాని పాత్ర‌లేమిటంటే..

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళా సంగీతమందిస్తున్నాడు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి  చిన్న అంతరాయం కలిగింది.

నాని, కిషోర్ తిరుమల చిత్రం అప్ డేట్

భావోద్వేగభరితమైన సన్నివేశాలని ఎంతో సహజంగా చిత్రీకరించడంలోనూ..

'నా పేరు సూర్య'.. మెసేజ్‌ ఏమిటంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ర‌చ‌యిత వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.  నేటి సమాజంలో ఎవరైతే దేశానికి తక్కువ ప్రాధాన్యతని ఇస్తూ...స్వార్ధంగా జీవిస్తున్నారో....అటువంటి వారికోసం ఈ సినిమా ద్వారా బలమĺ

వేసవి కానుకగా నితిన్ 25

యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన 25వ సినిమాని ‘రౌడీ ఫెలో’

భాగమతి చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు - అనుష్క

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం సూపర్ హిట్ టాక్ తో...