సీరత్ తో సంబంధం లేదంటున్న రాశి ఖన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం టచ్ చేసి చూడు`. ఈ చిత్రంతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం కానున్నారు. రాశిఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఫ్రెడ్డి దారువాలా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మురళీ శర్మ, సత్యం రాజేష్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా కథానాయిక రాశిఖన్నా మాట్లాడుతూ, “ఈ సినిమాలో నాది హ్యూమరస్‌గా ఉండే గ్లామర్ పాత్ర. రవితేజతో మరోసారి నటించడం మంచి అనుభూతి.
రెండోసారి కూడా మా కాంబినేషన్ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఇందులో మరో కథానాయికగా సీరత్ ఉన్నప్పటికీ.. ఆమెకు, నాకు ఎటువంటి కాంబినేషన్ సీన్స్ లేవు. మా ఇద్దరి పాత్రలు వేరు వేరు సందర్భాలలో వస్తూ వుంటాయి” అని తెలిపింది. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com