నేను ఏ సినిమా అయినా సైన్ చేయాలంటే ఆ రెండు నచ్చాలి - రాశీ ఖన్నా
Sunday, October 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల కథానాయిక రాశీ ఖన్నా. ఆతర్వాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ చిత్రాల్లో నటించిన రాశీ ఖన్నా తాజాగా హైపర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైపర్ లో రామ్ సరసన నటించిన రాశీ ఖన్నా టు షేడ్స్ ఉన్న రోల్ లో నటించి మెప్పించింది. ఈ సందర్భంగా హైపర్ హీరోయిన్ రాశీ ఖన్నా తో ఇంటర్ వ్యూ మీకోసం...!
హైపర్ లో మీ క్యారెక్టర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?
హైపర్ లో నేను టు షేడ్స్ ఉన్న రోల్ చేసాను. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉన్న నా రోల్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. డబల్ రోల్ చేసిన ఫీలింగ్ కలిగింది. దీనికి తోడు సినిమా చాలా బాగుంది అంటూ అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది.
మీరు క్యారెక్టర్స్ కోసం హోమ్ వర్క్ చేస్తుంటారా..?
సుప్రీమ్ లో బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ చేసాను. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ చేయలేదు. డైరెక్టర్ ఏం చెబితే అది చేసాను.
ప్రభావతి, సావిత్రి, బెల్లం శ్రీదేవి, భానుమతి...ఇలా మీ క్యారెక్టర్స్ కి ట్రెడిషనల్ గా ఉండే పేర్లు పెడుతున్నారు. నా క్యారెక్టర్ పేరు ఇలా ఉండాలి అని మీరేమన్నా సలహాలు ఇస్తున్నారా..?
నేను మీలాగే అనుకుంటున్నాను. ప్రభావతి, సావిత్రి, బెల్లం శ్రీదేవి, భానుమతి...ఇలా ట్రెడిషనల్ గా ఉండే పేర్లు నాకే ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నాను. అయితే....నా క్యారెక్టర్ కి ఇలాంటి పేరు పెట్టండి అని ఎవరికి చెప్పడం లేదు (నవ్వుతూ..)
రామ్ తో శివమ్ సినిమా చేసారు ఫ్లాప్ అయ్యింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఒకసారి ప్లాప్ అయిన కాంబినేషన్ ని రిపీట్ చేయరు. ఇలాంటి సెంటిమెంట్స్ దృష్టిలో పెట్టుకోకుండా రామ్ మళ్లీ ఆఫర్ ఇవ్వడం గురించి ఏమంటారు..?
ఆ సినిమా ఆడియోన్స్ కు నచ్చలేదు ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా నచ్చింది సక్సెస్ అయ్యింది. నేను ఇలాంటి సెంటిమెంట్స్ గురించి పట్టించుకోను. ఈ క్యారెక్టర్ కి నేను సూట్ అవుతాను అనుకున్నారు అందుకే అవకాశం ఇచ్చారు అనుకుంటున్నాను.
రామ్ తో రెండు సినిమాల్లో నటించారు కదా..? రామ్ నుంచి ఏమైనా నేర్చుకున్నారా..?
రామ్ వెరీ వెరీ హార్డ్ వర్కర్. డ్యాన్స్ & ఏక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ఈ సినిమాకి వర్క్ చేస్తూ రామ్ నుంచి చాలా నేర్చుకున్నాను.
తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు కదా...? తమిళ్ లో ఆఫర్ రావడం లేట్ అయ్యింది అనుకుంటున్నారా..?
తమిళ్ లో ఆఫర్ రావడం లేట్ అయ్యింది అని ఏమీ అనుకోవడం లేదు. తెలుగులో బిజీగా ఉన్నాను. అయినా నేను ఎక్కువ సినిమాలు చేసేయాలి అనుకోవడం లేదు. మంచి సినిమాలు చేయాలి అనుకుని స్ర్కిప్ట్ నచ్చితేనే చేస్తున్నాను.
తెలుగు, తమిళ్ లో మూవీస్ చేస్తున్నారు కదా. మరి...నెక్ట్స్ బాలీవుడ్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారా..?
నేను ఏదీ ప్లాన్ చేయను. ప్రస్తుతం తెలుగు, తమిళ్ మూవీస్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ బాలీవుడ్ ఆఫర్ వస్తే చేస్తాను.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా...డబ్బింగ్ ఎప్పుడు చెబుతారు..?
నాకు చెప్పాలనే ఉంది కాకపోతే నాకు అంత టైమ్ లేదు.
హైదరాబాద్ లో ఉంటూ తెలుగు సినిమాలు చేసిన మీరు ఇప్పుడు చెన్నైలో తమిళ్ సినిమాలు చేస్తున్నారు కదా..! హైదరాబాద్, చెన్నై రెండింటిలో ఏ సిటీ ఇష్టం..?
హైదరాబాద్, చెన్నై రెండూ ఇష్టమే. కాకపోతే హైదరాబాద్ మై హార్ట్..!
స్టార్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా...మరి మీరు కూడా ఐటం సాంగ్స్ చేస్తారా...?
ఐటం సాంగ్స్ చేయమని నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఐటం సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఐటం సాంగ్స్ చేయాలి అనుకోవడం లేదు. ఫ్యూచర్ లో ఆలోచిస్తాను.
ఒక సినిమాలో నటించాలంటే మీరు రెమ్యూనరేష్ చూసి ఓకే చేస్తారా..? లేక క్యారెక్టర్ నచ్చి ఓకే చేస్తారా..?
రెండునూ...(నవ్వుతూ..)
మీ డ్రీమ్ రోల్ ఏమిటి..?
నెగిటివ్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. ఎందుకంటే అది నాకు ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి (నవ్వుతూ..)
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తెలుగులో గోపీచంద్ తో ఆక్సిజన్ మూవీ చేస్తున్నాను. అలాగే రవితేజతో ఓ సినిమా చేస్తున్నాను. తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ గురించి డిష్కసన్స్ జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments