రాశి.. మూడేళ్ల తరువాత
Send us your feedback to audioarticles@vaarta.com
2014లో విడుదలైన తన తొలి తెలుగు చిత్రం ఊహలు గుసగుసలాడే తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా.. తన రెండో తెలుగు చిత్రం జోరుతో మంచి గాయనిగానూ పేరు తెచ్చుకుంది. ఆ తరువాత నటనపైనే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ మూడేళ్ల తరువాత గాయనిగా గొంతు సవరించుకుంది.
తన తొలి మలయాళ చిత్రం విలన్ (మోహన్‌లాల్) కోసం ఓ పాట పాడింది. అలాగే బాలకృష్ణుడు అనే తెలుగు సినిమా కోసం రెండు పాటలు పాడింది రాశి. మొత్తమ్మీద.. రాశి తీరు చూస్తుంటే.. హీరోయిన్‌గానే కాదు సింగర్‌గానూ దూసుకుపోయేలా ఉంది. ఇదిలా ఉంటే.. రాశి కథానాయికగా నటించిన తాజా చిత్రం జైలవకుశ ఈ నెల 21న విడుదల కానుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి బాబీ దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com