ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, త్రివేండ్రం ఇలా అన్ని నగరాలను చుట్టేస్తూ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ‘‘ఆర్ఆర్ఆర్’’లో మూడు పాటలను విడుదల చేశారు. అందులో 'నాటు నాటు' పాటలో హీరోలిద్దరూ వేసిన స్టెప్పులకు మాస్ జనాల నుంచి రెస్పాన్స్ లభించింది. ఇక 'జనని...' సాంగ్ సినిమాలో దేశభక్తిని, 'దోస్తీ' సాంగ్ హీరోల మధ్య ఫ్రెండ్‌షిప్‌ని ఎలివేట్ చేసింది.
రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు సంబంధించిన పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. కీరవాణి తనయుడు కాలభైరవ పాడిన 'కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో .. మండాలి కొడుకో..' అంటూ సాగే ఈ పాటను 'రివోల్ట్ ఆఫ్ భీమ్' పేరుతో విడుదల చేశారు. భీమా నినుగన్న నేలతల్లి.. ఊపిరిపోసిన సెట్టుసేమా.. పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా..?' అనే డైలాగ్ తో ఈ సాంగ్ మొదలైంది. కొమరం భీమ్ క్యారెక్టర్‌ను వర్ణిస్తూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది.
తాజాగా న్యూఇయర్ గిఫ్ట్‌గా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘రైజ్ ఆఫ్ రామ్’ పేరిట ‘రామం రాఘవమ్ రణధీరం రాజసం...’ అంటూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగింది. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయారు. కె.శివశక్తి దత్త సాహిత్యం అందించగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. విజయ్ ప్రకాశ్, చందనా బాల కల్యాణ్, చారు హరిహరన్ బృందంగా ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments