వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి అంటోన్న లక్ష్మీరాయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ లక్ష్మీరాయ్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిఅంటూ ప్రేక్షకుల ముందుకొస్తుంది లక్ష్మీరాయ్. పూర్తిగా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
మహత్, నవీన్ నేని, పంకజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com