తెలుగులో రాయ్‌లక్ష్మి?
Send us your feedback to audioarticles@vaarta.com
కాంచన మాల కేబుల్ టీవీ, నీకూ నాకూ చిత్రాల్లో నటించిన కన్నడ నటి రాయ్ లక్ష్మి ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చింది. మధ్య బాలకృష్ణ అధినాయకుడులో కూడా నటించింది. ఎక్కువ స్పెషల్ సాంగ్స్‌లోనే నటించిన ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తుంది.
వివరాల్లోకెళ్తే..
తెలుగులో ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీ్ధర్‌రెడ్డి, హెచ్.ఆనంద్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. ఈ చిత్రం ద్వారా కిషోర్‌కుమార్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజిత పొన్నాడ, మహత్, నవీన్ నేనీ, పంకజ్‌లు ప్రధాన పాత్రధాలుగా పోషిస్తున్నారు. కామెడీ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని రాయ్ లక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments