రాయ్ లక్ష్మి డబుల్ ధమాకా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు రాయ్‌లక్ష్మి. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో `వేర్ ఈజ్ వెంకట లక్ష్మి`... తమిళంలో `సిండ్రెల్లా`. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు.
వేర్ ఈజ్ వెంకటలక్ష్మి లుక్‌ను నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం విశేషం. ఈ లుక్‌లో సగం క్లాసిక్ లుక్‌తో.. మరో సగం మోడ్రన్ లుక్‌లో కనపడుతున్నారు రాయ్ లక్ష్మి. సిండ్రెల్లాలో సగం క్యూట్ లుక్‌తో కనపడుతుంటే మిగతా సగం హారర్ లుక్‌తో కనపడుతున్నారు. ఈ రెండు లుక్స్‌ను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పింది రాయ్ లక్ష్మి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments