'రాహు' మెమరీస్ వెంటాడతాయి - హీరోయిన్ కృతి గార్గ్
Send us your feedback to audioarticles@vaarta.com
విడుదలకు ముందే ఇండస్ట్రీ లో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమా ‘రాహు’. రేపు (శుక్రవారం) విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ కృతి గార్గ్ ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా కృతి గార్గ్ మాట్లాడుతూ: ‘‘నేను రాజస్థాన్ కు చెందిన అమ్మాయిని, కెరీర్ ప్రారంభంలో కొన్ని వెబ్ సిరీస్ చేశాను, రాహు తెలుగులో నా రెండో సినిమా ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెస్తుంది అని బలంగా నమ్ముతున్నాను. కెరియర్ బిగినింగ్ లో ఇలాంటి పాత్ర చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను. రాహు లో భాను పాత్రను ప్లే చేసాను... భాను లాంటి పాత్రలు ఏ హీరోయిన్ కెరియర్ లో అయినా అరుదుగా వస్తాయి. దర్శకుడు సుబ్బుగారు నన్ను ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. ఆడిషన్స్ టైం లోనే అతను ఎంత డిటైయిల్డ్ గా పనిచేస్తారో అర్ధం అయ్యింది. సినిమా చూస్తున్నప్పుడు కొత్త దర్శకుడు అనే ఫీల్ ప్రేక్షకులకు కలగదు.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు పెద్ద సపోర్ట్ గా నిలుస్తాయి. సిధ్ శ్రీరామ్ పాడిన ‘ఏమో ఏమో సాంగ్.. ’ మా సినిమా కు మేజర్ అసెట్ గా మారింది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా ప్రేక్షకులు ఏంజాయ్ చేస్తారు. అభిరామ్, నేను ఇద్దరం ఒకే స్టేజ్ లో ఉన్నాము.. అందుకే మా పని కూడా చాలా ఫ్రెండ్లీగా సాగింది. కాలకేయ ప్రభాకర్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలింది.
రాహు కథ నా చుట్టూ తిరుగుతుంది. నా పాత్రకు కన్వర్షన్ డిజార్డర్ ఉంటుంది. రక్తం చూస్తే నాకు కళ్ళు కనిపించవు, చిన్నపుడు తల్లిని కోల్పోయిన అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది అనే అంశంను డైరెక్టర్ సుబ్బు వేదుల గారు బాగా తెరకెక్కించారు.
ఒక నటిగా నేను మంచి సినిమాలు చెయ్యాలని భావిస్తాను, కథ, కథనాల మేరకు గ్లామర్ రోల్స్ చెయ్యడానికి నేను సిద్ధం. రాహు సినిమాలో పాత్ర పరిధి మేరకు గ్లామర్ సీన్స్ లో కనిపించబోతున్నాను. డైరెక్టర్ సుబ్బువేదుల ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్, తను నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు బాగా నచ్చింది, అంతే అందంగా తాను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే చాలా మంచి పేరును తెచ్చుకుంది. విజయశాంతి గారు మా సినిమా గురించి ట్వీట్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. అటువంటి గొప్ప నటి మా సినిమా సక్సెస్ కావాలని కోరుకోవడం మా అదృష్టం . ఆవిడకు మా అందరి తరపున చాలా కృతజ్ఞతలు.. రాహు జ్ఞాపకాలు ప్రేక్షకుల్ని కొంత కాలం వెంటాడతాయి’’ అంటూ ముగించారు.
న్యూ ఎజ్ థ్రిలర్ గా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout