'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రా రా`. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవుతుంది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నాని, తరుణ్, రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
సదానంద్ మాట్లాడుతూ - ``ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ సాధించిన దర్శక నిర్మాతలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నాని మాట్లాడుతూ - ``నాకు అష్టాచమ్మా నుండి శ్రీకాంత్‌గారితో మంచి పరిచయం ఉంది. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు హారర్ మూవీ రా.. రా చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మరో పెద్ద హిట్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తరుణ్ మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారి 125వ సినిమా ఇది. అందరూ కమెడియన్స్ కలిసి ఈ సినిమాలో నటించారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
అలీ మాట్లాడుతూ - ``శ్రీకాంత్ తొలిసారి హారర్ సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి చంద్రముఖి సినిమాలో రా..రా... అనే పదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ - ``నిర్మాత విజయ్‌తో మంచి అనుబంధం ఉంది. దక్షిణాది ఉన్న సినిమా పరిశ్రమలో తెలుగులోనే ఎక్కువ మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
నిర్మాత శ్రీమిత్ర చౌదరి మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారితో 24 సంవత్సరాల అనుబంధం ఉంది. నా స్వంత బ్రదర్‌లాంటి వ్యక్తి. ఈ కథ విన్న తర్వాత విజయ్ డైరెక్ట్ చేయాలని అనుకున్నాం. శ్రీకాంత్‌గారి వంటి సీనియర్ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారితో ఉన్న అనుబంధమే ఈ సినిమా చేయడానికి మమ్మల్ని ముందుకు నడిపించింది. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఆకట్టుకుంటుంది`` అన్నారు.
సంగీత దర్శకుడు షకీల్ మాట్లాడుతూ - ``నాపై నమ్మకంతో నాకు సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, హీరో శ్రీకాంత్ అన్నయ్యకు థాంక్స్`` అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ - ``నాని, తరుణ్‌లకు నా స్పెషల్ థాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్. ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు. హారర్ జోనర్‌లో నేను చేసిన తొలి సినిమా. హారర్ సినిమాలు చాలానే ఉన్నా.. ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. ఈ 23న విడుదలవుతున్న ఈ సినిమా నాకు మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. నిర్మాతలు విజయ్, శ్రీమిత్ర చౌదరిలకు థాంక్స్`` అన్నారు.
మా హీరో, మిత్రుడు శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈ నెల 23 న చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్' పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణమురళి, పృథ్వి, జీవ, చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్: దర్శకత్వం: విజి చరిష్ యూనిట్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com