ఆర్.నారాయణమూర్తి కంటతడి.. ఫేక్ న్యూసే కారణం!
Send us your feedback to audioarticles@vaarta.com
విప్లవ భావజాలం, సినిమాలతో సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్నారు. నారాయణమూర్తి చాలా సింపుల్ గా ఆడంబరాలకు దూరంగా జీవించేందుకు ఇష్టపడతారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోతారు. అలాంటి ఆర్. నారాయణమూర్తి ఓ ఫేక్ న్యూస్ వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని నారాయణమూర్తి స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. నారాయణమూర్తికి సొంత ఇల్లు లేదు. ఆస్తి లేదు. వాహనం లేదు. నడుచుకుంటూ వెళతారు. ఆయన్ని ఎవరూ ప్రశ్నించలేరు అని గద్దర్ అన్నారు. దీనితో నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి.
దీనితో చాలా మంది నారాయణమూర్తికి ఫోన్ చేస్తున్నారట. ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్నారట. ఈ వ్యవహారం తనని మానసికంగా కుంగదీసినట్లు నారాయణమూర్తి తెలిపారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మీడియా సమావేశంలో ఖండించారు.
'నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను ధనికుడిని. నాకు ఏదైనా సమస్య వస్తే సాయం చేసే ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. నన్ను ఎంతో అభిమానించే ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు అని నారాయణమూర్తి అన్నారు. సినిమా అన్నాక అప్పులు చేయడం తర్వాత తీర్చడం చాలా మాములు విషయం. సినిమా చేసి ఆస్తులు కొనుక్కునే మనస్తత్వం నాది కాదు.
ప్రస్తుతం నా దృష్టి రైతన్న సినిమాపై ఉంది. రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నా. ఇలాంటి తరుణంలో నేను దీనస్థితిలో ఉన్నానంటూ వస్తున్న అసత్య వార్తలు కుంగదీసే విధంగా ఉన్నాయి. అభిమానులు నాకు ఫోన్ చేసి జాలి చూపిస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. గద్దర్ అన్న ఆ మాటలు అన్నప్పుడు వెంటనే.. అన్న న దగ్గర డబ్బు ఉంది అని చెప్పాను. ఆ వార్తని మాత్రం ఎవ్వరూ రాయడం లేదు. ఇది ధర్మం కాదు అని నారాయణమూర్తి అన్నారు. నా ప్రశాంతత కోసమే పల్లెటూరిలో ఉంటున్నట్లు నారాయణమూర్తి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com