ప్రియమణి ప్రధాన పాత్రలో బహుభాష చిత్రం 'కొటేషన్ గ్యాంగ్'

  • IndiaGlitz, [Monday,September 07 2020]

హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు.హిందీ తెలుగు,తమిళ,తెలుగు,కన్నడ మరియు మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వివేక్.కె డైరెక్ట్ చేస్తున్నారు.
‘‘శ్రీమన్నారాయణ,మిరపకాయ్,పైసా లాంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుంది. ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్, అక్షయ ఇతర నటీనటులు. వీరితో పాటు, ఓ స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ మొత్తం ముంబై, తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాలలో జరుగబోతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.