close
Choose your channels

చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పీవీపీ!

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్' అని విజయవాడ వైసీపీ అభ్యర్థి, ప్రముఖ బిజినెస్‌మెన్ పొట్లూరి వరప్రసాద్‌ మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై మాట్లాడటానికి పీవీపీ మీడియా ముందుకొచ్చారు. తాను అన్నట్లుగా తన మాటలను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.

ఎక్స్‌ప్లెయిన్ చేయించుకో..

"చంద్రబాబు ఇంగ్లీష్‌ వచ్చిన వారిని పక్కనబెట్టుకుంటే మంచిది. అశ్వదామ హతహా.. కుంజరహా అన్నట్లుగానే తాను ఓ సదస్సులో మాట్లాడిన ఫుల్‌ స్పీచ్‌లో రెండు పదాలను కట్‌ చేసి ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు వాళ్ల వారు బ్రీఫ్డ్‌ చేసినట్లుగా లేరని, గల్లా జయదేవ్‌తో ఎక్స్‌ప్లేయిన్‌ చేయించుకుంటే మంచిది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ చేసిన పోరాటం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా దడిచేది లేదు. మాట తప్పం, మడమ తిప్పం.. పోరాడుతూనే ఉంటాము. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది" అని టీడీపీ నేతలకు, చంద్రబాబుకు పీవీపీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

అప్పుడేమయ్యారు మీరంతా..?

అంతటితో ఆగని ఆయన.. పోటీలు పడి ట్వీట్లు పెట్టడం కాదని.. కాస్త ఇంగ్లిష్‌ నేర్చుకున్నవారిని పక్కనపెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఆడుతున్న మైండ్‌గేమ్‌కు బెదిరేది ప్రసక్తే లేదని పీవీపీ తేల్చిచెప్పారు. "ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామన్నప్పుడు వామపక్షాలు ఏమయ్యాయి..? రామకృష్ణ ఎక్కడున్నారు..? హోదా సంజీవనా.. హోదా కలిగిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయ్.. ప్యాకేజీ నా కష్టం అని మాట్లాడిన చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడడం లేదు" అని పీవీపీ ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment