పి.వి.పి ఫిలాసఫీ..
Send us your feedback to audioarticles@vaarta.com
క్షణం, ఊపిరి చిత్రాలతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న పి.వి.పి తాజా చిత్రం బ్రహ్మోత్సవం. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం చిత్రం ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా పి.వి.పి తన గురించి...తను తీసే సినిమాలు గురించి..తన మనసులో భావాలును మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ..పి.వి.పి ఏమన్నారంటే...జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతకకూడదు అదే నా ఫిలాసఫీ. కన్విక్షన్తో బతకాలి. అలా బతకడం కొంచెం కష్టమే. కానీ... నాకు అదే ఇష్టం అన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.... సినిమా మేకింగ్ విషయంలో రాజీపడను. ఎవరికీ భయపడను. నిర్మాతగా నా అభిరుచి తగ్గట్టు సినిమాలు తీస్తాను. సినిమా అనేది నాకు అవసరం కాదు..ప్యాషన్ అని అన్నారు.
సినిమాల పై ఉన్న ప్యాషన్ వలనే ఇండియన్ సినిమాలో తొలిసారిగా అనదగ్గ చిత్రం తీయాలనే తపనతో తొలి సబ్ మెరైన్ మూవీ ఘాజీ తీస్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన నేను గతాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను పదవ తరగతిలో ఉన్నప్పుడే జీవితంలో తప్పకుండా మంచి స్థితిలో ఉంటాను అని నమ్మాను. నా టీచర్లు కూడా నన్ను నమ్మారు. ఇవాళ నేను ఎంత సంపాదించినా నీ ఆస్తి ఏంటి అని అడిగితే..సంతోషం అని చెబుతా. ముందున్న జీవితం గురించి ఆలోచిస్తూనే వెనక ఉన్న జీవితం తాలూకు ఆనవాళ్లను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను అదే నా ఫిలాసఫీ అన్నారు. జీవిత సత్యం తెలుసుకుని మరిన్ని మంచి చిత్రాలు అందించాలనుకుంటున్న పి.వి.పి ఆల్ ది బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments