పి.వి.పి కి హ్యాట్రిక్ దక్కేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన పేరు పి.వి.పి. రవితేజ హీరోగా బలుపు చిత్రాన్ని నిర్మించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు పి.వి.పి. బలుపు తర్వాత తమిళ్ లో విశ్వరూపం, తెలుగులో వర్ణ, సైజ్ జీరో చిత్రాలను నిర్మించినా..సక్సెస్ మాత్రం సాధించలేకపోయారు.
సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో... అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రధారులుగా పి.వి.పి నిర్మించిన విభిన్నకథా చిత్రం క్షణం. నూతన దర్శకుడు రవికాంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కోటి పదిలక్షల బడ్జెట్ తో రూపొంది ఘన విజయం సాధించడంతో పి.వి.పి సంస్థకు ఊపిరి నిచ్చింది క్షణం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన క్షణం చిత్రం రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారంటే ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఊహించుకోవచ్చు.
క్షణం తర్వాత పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మించిన భారీ చిత్రం ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో ఊపిరి చిత్రాన్ని నిర్మించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్నితెరకెక్కించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఊపిరి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన సరికొత్త తెలుగు సినిమా అనే టాక్ తో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించే దిశగా ప్రదర్శింపబడుతోంది. రొటీన్ కామెడీ ట్రాక్స్, అనవసరంగా వచ్చే ఫైట్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్...ఇవేమీ లేకుండా ప్రతి హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో ఓ మంచి చిత్రాన్ని చూసామనే ఫీలింగ్ కలించే ఫీల్ గుడ్ మూవీగా అందరి ప్రశంసలందుకుంటుంది ఊపిరి.ఇలాంటి చిత్రాలు సాధారణంగా కొంత మందిని మాత్రమే మెప్పిస్తాయి. కానీ...ఊపిరి సినీ ప్రముఖులు, సినీ విమర్శకులునే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుండడం విశేషం.
క్షణం - ఊపిరి ఈ రెండు విభిన్నకథా చిత్రాల తర్వాత పి.వి.పి సంస్థ నుంచి వస్తున్నమరో భారీ చిత్రం బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో బ్రహ్మోత్సవం చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు. ఇటీవల కాశీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న బ్రహ్మోత్సవం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసిన బ్రహ్మోత్సవం టీజర్ కి అనూహ్య స్పందన లభించింది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది సందర్భంగా బ్రహ్మోత్సవం కొత్త ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే నెలలో బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. క్షణం - ఊపిరి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన పి.వి.పి బ్రహ్మోత్సవం చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. మరి...మహేష్ బ్రహ్మోత్సవం సినిమాతో పి.వి.పి కి హ్యాట్రిక్ అందిస్తారని ఆశిస్తూ..ఆల్ ద బెస్ట్ టు పి.వి.పి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com