పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ
Send us your feedback to audioarticles@vaarta.com
నేడు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదలడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో పీవీపీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన పీవీపీ తన పెంపుడు కుక్కలను వారిపైకి వదలడంతో భయంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. పీవీపీ నిర్వాకంపై ఎస్సై హరీష్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీవీపీపై ఐపీసీ 353 కింద మరో కేసు నమోదు చేశారు.
కాగా.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లో ‘ప్రేమ్ పర్వత్ విల్లాస్’ పేరిట పీవీపీ కొన్ని నిర్మాణాలు చేశారు. వీటిలో ఓ విల్లాను విక్రమ్ కైలాష్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. తాజాగా ఆయన తన విల్లాలో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంటుండగా అక్కడకు వెళ్లిన పీవీపీ తన విల్లాలో అలాంటివేమీ చేయించడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారు. విల్లాలోని సామాగ్రినంతా ధ్వంసం చేశారు. దీంతో విక్రమ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీవీపీ, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశాడు. విచారణ నిర్వహించిన పోలీసులు నేడు పీవీపీని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కుక్కలను వదిలి వారిని భయబ్రాంతులకు గురి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments