నిర్మాత పివిపి అకౌంట్లో గోల్ మాల్.. మేనేజర్‌పై కేసు నమోదు ?
- IndiaGlitz, [Tuesday,September 17 2019]
ప్రముఖ సినీ నిర్మాత పి.వి.పి బ్యాంకు ఖాతా నుండి పది కోట్ల రూపాయలు గల్లంతైనట్లు వార్తలు వినపడుతున్నాయి. పి.వి.పి పర్సనల్ మేనేజర్‌గా చెప్పుకునే భాను ప్రకాశ్ అనే వ్యక్తే ఈ మొత్తాన్ని డైవర్ట్ చేశాడని వార్తలు వినపడుతున్నాయి. పివిపి తన అనుచరులతో భాను ప్రకాశ్‌ను బంధించారని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని వార్తలు వినపడుతున్నాయి.
భాను ప్రకాశ్ కూడా తన డబ్బుని మళ్లించినట్లు అంగీకరించడమే కాకుండా.. ఆ డబ్బుని తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం గత రెండు రోజులుగా నడుస్తుంది. భాను ప్రకాశ్‌పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని టాక్. అయితే మరో పక్క భాను ప్రకాశ్‌ను పివిపి మనుషులు నిర్బంధంలో ఉంచారని కూడా వార్తలు వినపడుతున్నాయి. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించిన పివిపి రీసెంట్గా ఎవరు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే మహేశ్ బాబు 25వ చిత్రం మహర్షిలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. భారీ బడ్జెట్‌తో పాటు లో బడ్జెట్ చిత్రాలు చేయడంలో పివిపి ఆసక్తి చూపుతుంటారు.