వంశీ పైడిపల్లి పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన పివిపి..!
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ వంశీ పైడిపల్లి పివిపి బ్యానర్ లో ఊపిరి సినిమా చేసారు. ఆతర్వాత ఇదే బ్యానర్ లో వంశీ పైడిపల్లి మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. మహేష్ బాబు ఈ బ్యానర్ లో చేసిన బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవ్వడంతో పివిపికి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వంశీ పైడిపల్లి పివిపి ఆఫీస్ లో ఉంటూ మహేష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసారు. మరి...ఏమైందో ఏమో కానీ...వంశీ పైడిపల్లి నిర్మాతను మార్చేసి మహేష్ 25వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను.
ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు అని ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. దీంతో పివిపికి కోపం వచ్చింది. తన ఆఫీస్ లో ఉంటూ స్ర్కిప్ట్ రెడీ చేసి ఇప్పుడు తనకు కాకుండా వేరే నిర్మాతతో సినిమా చేస్తుండడం ఏమిటి అంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు వంశీ పైడిపల్లి పై పివిపి ఫిర్యాదు చేసారని సమాచారం. మరి...పివిపి ఫిర్యాదుకు వంశీ పైడిపల్లి ఏం సమాధానం చెబుతారో..? ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com