ఆ వార్తలను ఖండించిన పి.వి.పి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఇప్పటి వరకు బలుపు, వర్ణ, సైజ్ జీరో, క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం తదితర చిత్రాలను నిర్మించింది. మహేష్ బాబుతో నిర్మించిన బ్రహ్మోత్సవం అంచనాలను అందుకోవడంలో ఫెయిలై..ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో ఇప్పటి వరకు పి.వి.పి సంస్థకు దాదాపు 100 కోట్లు నష్టం వచ్చిందని..అందుచేత పి.వి.పి సంస్థ ఇక నుంచి సినిమాల నిర్మాణం ఆపేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల పై పి.వి.పి సంస్థ స్పందిస్తూ...సినిమా నిర్మాణం ఆపేస్తున్నాం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి ఆధారాలు లేని వార్తలు. అవి రూమర్స్ మాత్రమే. అలాంటివి పట్టించుకోవద్దు. భవిష్యత్ లో భారీ చిత్రాలను, క్రేజీ కాంబినేషన్ మూవీస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం అని తెలియచేసారు. ఇదిలా ఉంటే... బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవ్వడంతో మహేష్ పి.వి.పి సంస్థకు మరో అవకాశం ఇచ్చారని..ఈసారి మహేష్ తో పి.వి.పి నిర్మించే చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com