టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో పీవీ సింధు ఓటమి.. ఆ ఛాన్స్ ఇంకా ఉంది!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలంపిక్స్ లో నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఓటమి చెందింది. చైనా క్రీడాకారిణి టై తిజు యింగ్ చేతిలో వరుస సెట్లలో సింధు ఓటమి చెందింది. దీనితో సింధు ఫైనల్ ఆశలు నిరాశగా మారాయి.
తొలి సెట్ లో సింధు, టై యింగ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఫస్ట్ సెట్ లో తొలి అర్థ భాగం వరకు సింధునే ఒక పాయింట్ లీడ్ లో కొనసాగుతూ వచ్చింది. కానీ చివర్లో యింగ్ పుంజుకుని తొలి సెట్ ని సొంతం చేసుకుంది. ఇక రెండవ సెట్ లో సింధు పూర్తిగా వెనుకబడిపోయింది.
యింగ్ జోరుకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. దీనితో వరుస సెట్లలో సింధు ఓటమి చవిచూసింది. 18-21, 12-21 స్కోర్స్ తో సింధు ఓటమి చెందింది. యింగ్ ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది అని చెప్పొచ్చు. ఆమె ర్యాంకింగ్స్ లో నెం 1 స్థానంలో కొనసాగుతోంది.
అయితే టోక్యో ఒలంపిక్స్ లో సింధుకి మరో మంచి అవకాశం ఉంది. ఆమె కాంస్య పతకం దక్కించుకునే ఛాన్స్ ఉంది. కాంస్య పతకం కోసం ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సింధు విజయం సాధిస్తే వరుసగా రెండవసారి ఒలంపిక్ మెడల్ సాధించిన ఘనత దక్కుతుంది.
2016 రియో ఒలంపిక్స్ లో సింధు ఫైనల్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో ఓటమి చెందడంతో సింధు సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఏది ఏమైనా టోక్యో ఒలంపిక్స్ లో మెడల్ సాధించే ఛాన్స్ సింధుకు ఇంకా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout