పొట్టి దుస్తుల్లో పీవీ సింధు.. కిరాక్ అంటున్న కుర్రాళ్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు గురించి ఇండియన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింధు ఆటలోనే కాదు.... అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఆట విడుపులాగా.. సాధ్యమైనప్పుడల్లా తనలోని హాట్ యాంగిల్ చూపిస్తూ రచ్చరచ్చ చేస్తోంది. ఆదివారం జరిగిన లాక్‌మే ఫ్యాషన్ షోలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఇద్దరూ స్టేజ్‌పై మెరిసారు. ఎప్పుడూ పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకోని సింధు ఫస్ట్ టైం ఇలా హాట్ హాట్ డ్రస్సులతో ర్యాప్ వాక్ చేయడం గమనార్హం. ఈ పొడుగు కాళ్ల అందాన్ని చూసిన కుర్రాళ్ల మతులు పోయాయట. సోషల్ మీడియాలో చాలా పాస్ట్‌గా ఉండే సింధు తన చిట్టి పొట్టి డ్రస్సులతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. అంతే నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు బాగున్నారు మేడమ్.. మీరు కేక అని అభినందిస్తుండగా.. ఇంకొందరు మాత్రం అసలెందుకిలా చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతోందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సెట్ కాని ప్రయోగాలు ఎందుకు సింధు..!?
సింధు ఇంతక మునుపెన్నడూ ఇలా చిత్ర విచిత్రాలుగా ప్రయోగాలు చేసిన సందర్భాల్లేవ్. అంతేకాదు ఈమెకు మేకప్ కూడా పెద్దగా సెట్ అవ్వదు. అప్పట్లో ఓ మేగజైన్ కోసం ఫొటో షూట్‌లో సింధు ఫుల్ మేకప్‌తో ఉండటంతో వాటిని చూసిన ఆమె కుటుంబీకులు, క్రీడాభిమానులు కంగుతిన్నారు. అస్సలు ఈమె సింధునేనా..? అన్నట్లుగా ఆ ఫొటోలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ డ్రెస్సులో మాత్రం స్టార్ ప్లేయర్ కిరాక్ అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సుందరి హాట్ హాట్ అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. రీల్ హీరోయిన్ల కంటే మీరు చాలా సూపర్బ్‌గా ఉన్నారంటూ క్రీడాభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నేనేం తక్కువ కాదు..!?
ఇక సైనా నెహ్వాల్ విషయానికొస్తే.. సింధు పొట్టి దుస్తులేస్తే తానేం తక్కువ కాదన్నట్లుగా గ్లామర్ యాంగిల్స్‌తో ఇంకాస్త డోస్ పెంచి కుర్రాళ్ల మనసు దోచుకుంది. వాహ్ చాంపియన్ అదరగొట్టేశారు అంటూ సైనా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పెళ్లి బంధం ద్వారా ఒకింటివారైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14 ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments