సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది...

  • IndiaGlitz, [Sunday,September 30 2018]

రీసెంట్‌గా బాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ స్టార్ట‌య్యింది. ఇప్పుడు మ‌రో బాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ ప‌త‌క విజేత పి.వి.సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రాన్ని సోనూసూద్ నిర్మిస్తుండ‌టం విశేషం. రీసెంట్‌గా సోనూ సింధుని హైద‌రాబాద్‌లో క‌లిశారు. ''సింధు ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఆమె జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలుసు. దీన్ని సినిమా రూపంలో తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

ఒలింపిక్స్‌లో ఆమె ప‌తకం సాధించే వ‌ర‌కు బయోపిక్‌ను తెర‌కెక్కిస్తే చాల‌నుకున్నాం. అయితే ఆ త‌ర్వాత కూడా ఆమె మ‌రిన్ని విజ‌యాలు సాధించ‌డంతో వాటిని కూడా స్క్రిప్ట్‌లో యాడ్ చేస్తున్నాం. ఇప్పటికీ స్క్రిప్ట్ 95 శాతం పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం'' అన్నారు. మ‌రి పి.వి.సింధుగా న‌టించేబోయే హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే...