సింధు బయోపిక్‌కి రంగం సిద్ధమవుతుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ స్టార్టయ్యింది. ఇప్పుడు మరో బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు బయోపిక్‌కి రంగం సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని సోనూసూద్ నిర్మిస్తుండటం విశేషం. రీసెంట్గా సోనూ సింధుని హైదరాబాద్‌లో కలిశారు. ``సింధు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆమె జర్నీ గురించి అందరికీ తెలుసు. దీన్ని సినిమా రూపంలో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాం.
ఒలింపిక్స్‌లో ఆమె పతకం సాధించే వరకు బయోపిక్‌ను తెరకెక్కిస్తే చాలనుకున్నాం. అయితే ఆ తర్వాత కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించడంతో వాటిని కూడా స్క్రిప్ట్‌లో యాడ్ చేస్తున్నాం. ఇప్పటికీ స్క్రిప్ట్ 95 శాతం పూర్తయ్యింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం`` అన్నారు. మరి పి.వి.సింధుగా నటించేబోయే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com