పివి సింధు బయోపిక్...

  • IndiaGlitz, [Monday,May 01 2017]

గ‌త ఏడాది ఓలింపిక్స్‌లో భార‌త‌దేశానికి వెండి ప‌త‌కాన్ని తెచ్చి పెట్టిన బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పివి సింధు బ‌యోపిక్ రూపొంద‌నుంది. ఈ బ‌యోపిక్‌ను న‌టుడు, నిర్మాత అయిన సోనూసూద్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఇటీవ‌ల సోనూసూద్ అభినేత్రి సినిమాను హిందీలో విడుద‌ల చేశాడు. ఇప్పుడు మ‌రోసారి నిర్మాత‌గా మారి పివి సింధు బ‌యోపిక్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఎనిమిది నెల‌లుగా ఈ బ‌యోపిక్ గురించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని సోనూ మీడియాకు వెల్ల‌డించాడు.

ఎందరో భార‌తీయుల‌కు స్ఫూర్తిగా నిలిచిన పివి సింధు జీవితాన్ని సినిమాగా తీయ‌డం ఆనందంగా ఉంద‌ని సోనూ సూద్ చెప్పాడు. సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కూడా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ళ‌నుంది. సైనా నెహ్వాల్‌గా శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించ‌నుంది.