న్యాయవాద దంపతుల హత్య కేసు పుట్టా మధు మెడకు చుట్టుకుంటోందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఈ హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ నేత పుట్టా మధు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ హత్య కేసులో సూత్రధారిగా పుట్టా మధు పేరు వినిపిస్తోంది. ఈ హత్య కేసులో ఆధారాలు కూడా ఆయనే హత్యకు సూత్రధారి అనేలా లభిస్తున్నాయి. ముందుగా ఈ కేసులో పుట్టా మధు అనుచరుడు కుంట శ్రీను విషయం బయటకు రాగా.. ఆ తరువాత తాజాగా పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను వ్యవహారం బయటపడింది. వీరి వెనుక పుట్ట మధు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పుట్టా మధు ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ఆది నుంచి మధుకు టీఆర్ఎస్ పార్టీ ఆయన ఓడిపోయినప్పటికీ ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. ఆయన కూడా రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతకైనా వెనుకాడరనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోకల్ పాలిటిక్స్‌లో పట్టు సాధించేందుకు ఆయన చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. అలాంటి వ్యక్తి రాజకీయ జీవితానికే ఈ హత్యలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోవైపు న్యాయవాదిగా వామనరావుకి చాలా మంచి పేరుంది. అలాంటి న్యాయవాదులను ప్రత్యక్షంగా పొట్టన పెట్టుకున్నారని కుంటా శ్రీను, బిట్టు శ్రీను మరీ కొందరు ఉన్నారని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది.
మొత్తానికి ఈ హత్య కేసు మొత్తంగా పుట్టా మధు మెడకు చుట్టుకుంటోందని తెలుస్తోంది. అయితే వామనరావు మాత్రం కొన ఊపిరితో ఉండగా కుంట శ్రీను పేరు చెప్పారు. దీంతో పోలీసులకు నిందితులను పట్టుకోవడం సులువుగా మారింది. ఘటనలో కుంట శ్రీనుతో పాటు కుమార్ ఉన్నారని తొలుత భావించినప్పటికీ.. కుంట శ్రీను పట్టుబడిన తర్వాత అతడితో ఉన్నది కుమార్ కాదని చిరంజీవి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ కేసులో ఇంకా పూర్తి నిజానిజాలు వెలుగు చూడాల్సి ఉందని తెలుస్తోంది. అయితే మొదట కుంట శ్రీనుతో పాటు అక్కపాక కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments