తెలుగు »
Cinema News »
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్ రావు
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్ రావు
Monday, May 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పుస్కూర్ రామ్ మోహన్‌రావును నియమిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. సుధీర్ఘకాలంగా చిత్రసీమకు ఆయన చేస్తున్న సేవలకు గాను రామ్ మోహన్‌రావును ఈ పదవి వరించింది. మల్టీడైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా వ్యవహరిస్తున్న రామ్మోహన్రావు 31 ఏళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పురోభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 25 చిత్రాల్ని నిర్మించారు. డిజిటలైజేషన్ సాంకేతిక విధానాన్ని తొలిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు పరిచయం చేశారాయన. పంపిణీదారుడిగా ఆయనకు విశేష అనుభవముంది.
డిస్ట్రిబ్యూటర్‌గా పదేళ్ల ప్రయాణంలో దేశవ్యాప్తంగా 250కిపైగా సినిమాలను విడుదలచేశారు. 1993-95లో కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా ఆయన సేవలందించారు. అదే సమయంలో ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సెక్రటరీగా వ్యహరించారు రామ్ మోహన్‌రావు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడవడం పట్ల రామ్ మోహన్‌రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నిర్మాతగా చిత్రపరిశ్రమతో నాకు ముఫ్ఫై ఏళ్లుగా అనుబంధముంది. సినీ పరిశ్రమలోని లోతుపాతులు, సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది. పదవి రావడం కొత్తగా అనిపించడం లేదు. కుటుంబం లాంటి చిత్ర పరిశ్రమతో ఇంకా అనుబంధం పెంచుకోవడానికి ఈ పదవి దోహదపడుతుందని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సహకారంతో భవిష్యత్‌లో తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడతాను అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments