close
Choose your channels

ఆనంద్ దేవరకొండ హీరో గా 'పుష్పక విమానం' ఫస్ట్ లుక్ రిలీజ్

Monday, March 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘‘దొరసాని’’ లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన
మూడో సినిమాగా "పుష్పక విమానం" అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ : ఈ కథని న్యూస్ లో చూసి ఇన్స్పైర్ అయి దానికి నిజ జీవిత క్యారెక్టర్స్ ని జోడించి తయారు చేసుకున్నాను , మొదట ఈ కథని విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చడంతో ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అదే టైం లో ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా రిలీజ్ అవడంతో ఈ కథకి అతను అయితే బావుంటాడని అనుకుని ఆనంద్ దేవరకొండ హీరో గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది . ఇందులో ఆనంద్ తో పాటు సునీల్, నరేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.శాన్వి మేఘన,గీత్ సాయిని , ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. అందర్నీ అలరిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది." అని అన్నారు.

నటీనటులు:ఆనంద్దేవరకొండ,గీత్సైని,శాన్విమేఘన,సునీల్,నరేష్,హర్షవర్థన్,గిరిధర్,కిరీటి,భద్రం,వైవాహర్ష,అభిజిత్,అజయ్,సుదర్శన్,శరణ్య,మీనా వాసు,షేకింగ్ శేషు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment