ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రెడీ అవుతున్న ‘‘పుష్ప’’.. ఇక ప్రమోషన్స్‌లో దూకుడే..!!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి పార్ట్‌ని ‘‘పుష్ప ది రైజింగ్ ’’ పేరిట డిసెంబర్ 17న మూవీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు, పోస్టర్స్, లుక్స్, పాటలు అంచనాలను పెంచేశాయి. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్ భైరవ్ సింగ్ షెకావత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అల్లు అర్జున్, పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో, రష్మిక మందన్న... శ్రీవల్లి అనే పాత్రను పోషిస్తున్నారు. 1980లలో చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 17కు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఏవో రెండు పాటలు, సునీల్, అనసూయల క్యారెక్టర్‌లకు సంబంధించిన పోస్టర్లు తప్పించి ఇంత వరకు టీజర్, ట్రైలర్స్ విడుదల చేయకపోవడంతో ఈ సినిమా రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ సైతం పుష్ప యూనిట్‌ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై మేకర్స్ స్పందించినట్లుగా వుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.
అయితే ఈ ట్రైలర్‌ను సింపుల్ సోషల్ మీడియాలోనో.. లేదంటే యూట్యూబ్‌లోనో వదిలేయకుండా.. అల్లు అర్జున్ రేంజ్‌కి తగ్గట్టుగా ఒక వేదిక ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. అందుకే డిసెంబర్ 2వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలనే ఆలోచనలో వున్నట్లుగా ఫిలింనగర్ టాక్. తెలుగుకు సంబంధించి ఆ రోజున ఇక్కడ ఈవెంట్‌ను జరిపేసి, ఆ తరువాత మిగిలిన భాషల్లోను ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలన్నది నిర్మాతల ప్లాన్‌గా తెలుస్తోంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments