షూటింగ్‌ను ప్రారంభించుకున్న ‘పుష్ప’..
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తికి తెరదించుతూ మంగళవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను దర్శకుడు సుకుమార్ ప్రారంభించారు. తాజా షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్‌లో జరగనుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ‘పుష్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే అల్లు అర్జున్, సుక్కు సహా చిత్ర యూనిట్ సభ్యులంతా మారేడిమిల్లి చేరుకున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్రంలో నారావారబ్బాయి కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర కోసం నారా రోహిత్‌ను సుకుమార్ ఎంచుకున్నారని సమాచారం. అల్లు అర్జున్, రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నాడని తెలుస్తోంది. రంగస్థలం తరహాలోనే పుష్ప కూడా రివేంజ్ డ్రామాగానే సుకుమార్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments