వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో పుష్ప సాంగ్ చిత్రీకరణ.. వెండితెరపై పూనకాలే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది సంక్రాంతికి ‘‘అల వైకుంఠపురంలో’’ అనే చిత్రంతో మెగా హిట్‌ను అందుకుని రికార్డులను తిరగరాశాడు. నటనలోనూ ఎంతో పరిణితి సాధించిన బన్నీ.. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. .
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించి షూటింగ్ పూర్తి కావొచ్చింది. మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్లతో సాంగ్ ప్లాన్ చేశారని, ఇది వెండితెరపై అదిరిపోయే ఫీస్ట్‌గా మారుతుందని అంటున్నారు. దీపావళి సందర్భంగా ఓ పోస్టర్ కూడా చిత్ర బృందం విడుదల చేయగా, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments